తరగతులు మరియు కార్యక్రమాలు
Training classes and programs conducted by Sri Dattha Foundation
సంకల్ప క్రియాయోగ(SKY) 10 రోజులు
గురూజీ ద్వారా అందించబడే ప్రాథమిక కోర్స్ ఇది పది రోజుల పాటు ఉంటుంది. ప్రతిరోజు రెండు గంటలు యోగ సాధన మరియు ఆధ్యాత్మికమైన సాధనలు వాటితో పాటుగా ఆహార నియమాలని అందివ్వటం జరుగుతుంది. ఈ కోర్సు ద్వారా మానవుల్లో ఉండే అనేక రకాలైన బలహీనతలను, చెడు సంస్కారాలను తొలగించి వారి సంకల్పాలను నెరవేర్చుకునే విధంగా సాధనలు చేయించబడతాయి. వివిధ రకాల రుగ్మతలతో ఇబ్బంది పడుతూ మానసికంగా కూడా బలహీనమవుతున్న వారికి ఈ కోర్సు ఒక వరం. కేవలం పది రోజుల్లోనే వారు ఎంతో శక్తివంతులుగా మారి తమ జీవితం పట్ల పూర్తి సకారాత్మకమైన దృక్పథాన్ని పొందుతారు. దీర్ఘకాలిక రుగ్మతల్ని నివారించుకునే సాధనలు అన్నీ అందించబడతాయి. ఈ పది రోజుల్లో వ్యాయామాలు, శ్వాస ప్రక్రియలు, ప్రాణాయామాలు, సూర్య నమస్కారాలు, కాయకల్ప, ఆసనాలు మరియు ప్రత్యేకమైన ధ్యానాలు నేర్పించి సాధన చేయించబడును.
అతీంద్రియ యోగ (4 రోజులు)
ఇది నాలుగు రోజులు గురూజీ ద్వారా ప్రత్యక్షంగా అందించే రెసిడెన్షియల్ శిక్షణ. ప్రశాంతమైన వాతావరణంలో పూర్తిగా గురూజీ పర్యవేక్షణలో జరిగే కోర్స్. ఈ కోర్సులో దేహాన్ని పూర్తిగా శుద్ధి చేసే యోగ క్రియలు, ఆనంద పరవశులను చేసే ఆధ్యాత్మిక సాధనలు, ఆహారపు మార్పులు అందిస్తూ శరీరాన్ని పూర్తిగా తేలికగా చేసి సాధకుడు సాధనలో పట్టు సాధించే శక్తిని అందివ్వబడుతుంది. ఈ శిక్షణ పూర్తి చేస్తే బయట ప్రపంచంలో ఎటువంటి పరిస్థితులైన తట్టుకుని దృఢత్వం సిద్ధిస్తుంది.
ఆత్మ శుద్ధి యోగ (మౌన దీక్ష)- 5 రోజులు
గురుజి సంగత్యంలో ప్రత్యేకమైన ఆశ్రమ వాతావరణంలో ఐదు రోజులపాటు పూర్తి మౌనంగా ఉండే అద్భుతమైన శిక్షణ. దీని ద్వారా అంతర్ముఖ ప్రయాణం జరిగి మనలో ఉన్న బలహీన, నెగిటివ్ అంశాలన్నీ తొలగిపోయి సంకల్ప సిద్ధి కలుగుతుంది. ఇది పూర్తిగా తపోసాధన అందువలన మనోనిశ్చలత్వాన్ని అందిస్తుంది.
అద్వైతానంద యోగ ( 5 రోజులు)
ఈ ఐదు రోజుల కోర్సు ద్వారా వ్యక్తిగత జీవితంలో విజయవంతమవుతూ ఆధ్యాత్మికంగా ఎలా ఎదగాలో నేర్పబడుతుంది ఆధ్యాత్మికం మరియు భౌతికములని సమాన స్థితిలో చూడగలిగే జ్ఞానం పొంది, తమ జీవితంలో అన్ని సమస్యల నుండి విడుదలయ్యే మార్గం తెలుస్తుంది. తన చుట్టూ ఉన్న ప్రపంచం నుండి వచ్చే నెగటివ్ ఎనర్జీలు అన్నింటినీ కూడా సులభంగా అధిగమింపజేసే ప్రత్యేక కోర్స్ ఇది. ఈ శిక్షణ పూర్తి చేసిన వారికి మనస్సు పసిబిడ్డల మనసు వలె నిర్మలంగా నిష్కల్మషంగా ఉంటుంది.
బాల సంస్కార్ (10 రోజులు)
10 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల బాలబాలికల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పది రోజుల శిక్షణ. బాల్యంలో చూసిన విత్తనాలు బ్రతకంతా ఉంటాయి అంటారు. ఆ విధంగా చిన్న వయసులో గురుజి ద్వారా తమ భవిష్యత్తుకు బంగారు బాటను ఏర్పరచుకుంటారు విద్యార్థులు. తల్లిదండ్రులను, గురువులను ఏ విధంగా గౌరవించాలి, పెద్దలతో ఎలా ఉండాలి, ఎటువంటి స్నేహాలు అవసరము, సమాజంలో ఉత్తమ వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం కావాలి అనేవి నేర్పించే బాలల వ్యక్తిత్వ వికాస యోగ శిక్షణ. బిడ్డలను రత్నాలుగా మార్చే ఒక వినూత్న కార్యక్రమం. నేటి ప్రపంచ విజయవంతలు వారి భవిష్యత్తును పాడు చేయకుండా దృఢ సంకల్పం గల వ్యక్తులను తయారు చేసే ఒక అద్వితీయమైన శిక్షణ.
గురూజీల శిక్షణ (టీచర్ ట్రైనింగ్ కోర్స్ టిటిసి 15 రోజులు)
15 రోజుల ఈ కోర్సులో సమాజానికి సుశిక్షితులైన యోగ, ఆధ్యాత్మిక గురువులను తయారు చేయడం జరుగుతుంది. నిస్వార్ధంగా ఉత్తమమైన క్రమశిక్షణ గల గురువులను, నేటి ప్రపంచంలో ఎంతోమందికి సేవలు చేసే విధంగా పూర్తిస్థాయిలో యోగా టీచర్ ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్ ఇవ్వబడుతుంది.
ACTIVITIES
Programs to be organized by the organization in future
Construction of Ashram
To gain mastery in Sadhana and to grow spiritually means companionship of Guru and peaceful environment is also essential. That is why we are soon going to build a spiritual ashram with all the facilities for the sadhakas who want to enter the meditation foundation and practice and for the meditators who want to live peacefully. Continuous residential courses are conducted to impart knowledge to the aspirants.
Yoga Vidyalaya
Free education for every student who is an orphan and aspires for higher education.
A Yoga Vidyalaya to be built with the determination to provide high standards.
Training Center for Women
A center that trains young women who are facing problems in life and are currently living alone, in various fields depending on their interest and leads them towards self-employment.
Old Age Home (Premalayam)
Vanaprasthasram is a special center that provides a little love to those who need it, that love and the facilities needed at that age to spend the rest of their lives happily and spiritually.
Goshala
This is an arrangement to protect cows which is good for nature and human beings.
Along with these, Dhyana Foundation is coming to you with many service programs.
Sri Dattha Foundation, one can message 8341187111 on WhatsApp.
స్థిరంగా సంతోషంగా ఉండడం నేర్చుకోండి!
హ్యాపీనెస్ ప్రోగ్రామ్లో చేరండి. ప్రశాంతమైన మనస్సు, తగ్గిన ఆందోళన, పెరిగిన శక్తి స్థాయిలు మరియు స్థిరమైన ఆనందాన్ని ప్రతిరోజూ అనుభవించండి!